28 November, 2025

Hyderabad
Regional Centre

|






News Detail

Press Release on TEE Dec 2025

28 November, 2025

Dr.Raju  Bolla

Regional Director          

   తేదీ : నవంబర్ 27, 2025

పత్రికా ప్రకటన ప్రచురణార్ధం

ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం

ప్రాంతీయ కేంద్రం : హైదరాబాద్

        ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) దేశ వ్యాప్తంగా డిసెంబర్, 2025 టర్మ్ ఎండ్ ఎగ్సామినేషన్స్ ను 01 డిసెంబర్, 2025 నుండి 14 జనవరి, 2025  వ తేదీ వరకు నిర్వహించుతున్నది.  డిగ్రీ మరియు పీ జి  విద్యార్థులతో పాటుగా డిప్లొమా, పీ జి డిప్లొమా మరియు  సర్టిఫికెట్ ప్రోగ్రాములకు సంబంధించిన విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించబడుతాయని, హైదరాబాద్ లో ఆరు  , వరంగల్ లో ఒకటి ,బోధన్ లో ఒకటి ,నల్గొండ లో ఒకటి ఎగ్జామ్ సెంటర్స్ లలో ఈ పరీక్షలు నిర్వహించబడుతాయని ఇగ్నో, హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు, డాక్టర్ రాజు బోళ్ల  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

            ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను ఇగ్నో వెబ్ సైట్ www.ignou.ac.in నుండి డౌన్లోడ్ చేసుకోవాలని వారు సూచించినారు.  పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయం కన్నా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించినారు.  పరీక్షా కేంద్రంలోకి ఏవిధమైన మొబైల్ ఫోన్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసురావద్దని వారు పేర్కొన్నారు .

  ఇతర పూర్తి వివరాలకు అభ్యర్థులు ఇగ్నో వెబ్సైట్ (అంతర్జాలం) www.ignou.ac.in లేదా 9492451812/040-23117550 ఫోన్ నెంబర్ లలో సంప్రదించగలరు.

                                                                                

                                                                                    ఇట్లు

                                                                                        డాక్టర్ రాజు బోళ్ల

                                                                                         ఇగ్నో, ప్రాంతీయ సంచాలకులు,